Whatsapp కష్టాలు – Part 1
మన చిన్నపుడు School ఎగ్గొట్టి friends తో ఆడుకుంటున్నపుడు
ఊరి చివర ఉన్న చింత చెట్ల దగ్గరో, బావి గట్ల దగ్గరో…నాన్న friend కో, దూరపు చుట్టానికో దొరికితేనే ఇంట్లో డబ్బిడి దిబ్బిడి….
లేకపోతే దొరికేవరకు…
కుదిరినన్ని రోజులు రాజాలా స్కూల్ డుమ్మా కొట్టి ఆడుకోవడమే…!
కానీ ఇప్పుడో?
ఒక్క రోజు School ఎగ్గొట్టడం ఆలస్యం ….
Parent- teacher Whatsapp group లో Message –
“Your son is absent to school today. Please report the reason!” అంటూ!
అదీ కాదూ అంటే…
ఎవరో ఒక classmate వాళ్ళ అమ్మ నుంచి Whatsapp message…
“ఏమైందండీ ఇవ్వాళ మీ వాడు School కి రాలేదట… మా వాడికి bore కొట్టిందట” అంటూ…
Home work ఎగ్గొట్టడం కోసం…
“ఇవ్వాళ Home work లేదమ్మా”
అని పిల్లోడు చెప్పే మాట complete అయ్యే లోపే Class Whatsapp group లో Message –
“Anyone out there… please help me with this math problem” అంటూ…
“ఊరెళ్ళి వచ్చిన Ishaan Notes అడిగాడమ్మా … నాకు pending work ఉంది అని ఇవ్వలేదు”
అని చెప్పిన పిల్లోడికి….
“సరే లే నాన్నా… ఇవ్వాళ work finish చేస్కుని రేపు ఇవ్వు” అని చెప్పేలోపే…
ఆ Ishaan వాళ్ళ అమ్మ Phone
“ఎక్కువేం కాదు just ఓ 50 pages ఉంటుంది కొంచెం Photos తీసి Whatsapp లో పంపేద్దురూ Please” అంటూ… !!
“Sunny వాళ్ళింటికి వెళ్లి ఆడుకొని వస్తానమ్మా”
అని అనడమే Sunny వాళ్ళ అమ్మ numberకి Whatsapp message
“My son is coming to play with sunny. Please send him back in an hour” అంటూ….
రాకపోతే repeated messages and calls!!
మన చిన్నపుడో …?
Friends దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే Permission…
ఒక్కో సారి అది తీసుకున్న గుర్తు కూడా లేదు.
బయటికి అంటూ వెళ్ళాక… ఆడుకోడం మనిష్టం …. ఎప్పుడు తిరిగి రావాలో కూడా మనిష్టమే !
Waiting ఇక్కడ …Hurry Up!
పాపం …
ఇవ్వాళ-రేపు పిల్లలకి ఎన్ని కష్టాలో కదూ …
ఇలాంటి ఇంకొన్ని ‘పిల్లల’ కష్టాలు మీ నోటి నుంచి వినడం కోసం నేను waiting …hurry up!!
P.S: This post is intended only for పిల్లల కష్టాలు ! పెద్ద వాళ్ళ కష్టాలు ఇంకో పోస్టులో …!